ak goyal: డబ్బులు దాచారనే సమాచారం... ఐఏఎస్ మాజీ అధికారి ఏకే గోయల్ నివాసంలో తనిఖీలు

  • జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 22లోని గోయల్ నివాసంలో నాలుగు గంటలుగా తనిఖీలు
  • 2010లో పదవీ విరమణ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొన్నాళ్లు సలహాదారుగా పని చేసిన గోయల్
  • గోయల్ నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
Police search operation in AK Goyal house

ఐఏఎస్ మాజీ అధికారి ఏకే గోయల్ ఇంట్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఆయన నివాసంలో భారీగా డబ్బులు దాచారనే సమాచారం రావడంతో... జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 22లో గల గోయల్ నివాసంలో దాదాపు నాలుగు గంటలుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకే గోయల్ 2010లో పదవీ విరమణ చేశారు. అనంతరం కొన్నాళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పని చేశారు. మాజీ అధికారి కాబట్టి ఆయన నివాసంలో డబ్బులు దాచి ఉంటారని సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. గోయల్ సమక్షంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు విలువైన వస్తువులను లోపలి నుంచి బయటకు తీసుకు వెళ్తున్నారని ఆరోపించారు. ఓ టాస్క్ ఫోర్స్ పోలీసు వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన బైక్‌ను ఆపేశారు.

  • Loading...

More Telugu News