IMD: వచ్చే వారం బంగాళాఖాతంలో తుపాను

IMD Weather Update
  • ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
  • దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం
  • ఈ నెల 29 నాటికి వాయుగుండంగా మారుతుందన్న ఐఎండీ అమరావతి కేంద్రం
బంగాళాఖాతంలో తుపాను ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 27 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అమరావతి కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. ఇది తుపానుగా మారే అవకాశాలు ఉన్నట్టు ప్రైవేటు వాతావరణ సంస్థల నమూనాలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతానికి దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ వివరించింది. 

అటు, గడచిన 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. కేరళలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. తమిళనాడులోని మెట్టుపాళయంలో అత్యధికంగా 37 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. 

IMD
Weather
Amaravati
Cyclone
Low Pressure
Bay Of Bengal

More Telugu News