: డీఎల్ విశ్వసనీయుడు... సీఎం తప్పులు చేస్తున్నారు: మేడంతో రాజనర్సింహ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో డిప్యుటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. సీఎం వ్యవహార శైలి, డీఎల్ బర్తరఫ్ తో పాటు పార్టీని పటిష్టం చేసే చర్యలపై చర్చిస్తున్నారు. బర్తరఫ్ ఘటన అనంతరం రాష్ట్రంలోని నేతల అభద్రతాభావం, పార్టీపై ప్రజల్లో జరుగుతున్న చర్చ వంటి విషయాలను అధినేత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎం తప్పుడు నిర్ణయాలతో పార్టీకి అప్రతిష్ఠ వస్తోందని, ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కనీసం మంత్రి వర్గంతో చర్చిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత కక్షలు పార్టీకి చెడుచేస్తాయని, డీఎల్ విశ్వసనీయత గురించి సోనియాకు వివరించినట్టు తెలుస్తోంది.

More Telugu News