Chandrababu: రింగ్ రోడ్డు, ఇసుక కేసులు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

Chandrababu IRR and Sand case court hearing updates
  • రింగ్ రోడ్డు కేసు విచారణ ఈనెల 29కి వాయిదా
  • ఇసుక పాలసీ కేసు విచారణ 30కి వాయిదా
  • చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. మరోవైపు ఇసుక పాలసీ కేసులో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.  

Chandrababu
Telugudesam
Inner Ring Road Case
Sand policy case

More Telugu News