Hema Malini: మధురలో హేమామాలిని నృత్యం.. మీరాబాయిగా అలరించిన ఎంపీ.. వీడియో ఇదిగో!

  • మీరాబాయి 525వ జయంతి వేడుకల్లో మాజీ నటి డ్యాన్స్ షో
  • కృష్ణుడిపై మీరా ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించిన హేమామాలిని
  • ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు
Hema Malini Performs Dance Drama As Meera Bai In Mathura

మీరాబాయి 525వ జయంతి ఉత్సవాలు ఉత్తరప్రదేశ్ లోని మధురలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో మాజీ నటి, మధుర ఎంపీ హేమమాలిని నృత్య ప్రదర్శన ఇచ్చారు. శ్రీకృష్ణుడిపై మీరాబాయి ప్రేమను తన నృత్యంతో ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించారు. 75 ఏళ్ల వయసులోనూ ఎంతో ఎనర్జీతో ఆమె చేసిన డ్యాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రదర్శన పూర్తయిన తర్వాత ఎంపీ హేమమాలినిని ప్రధాని సత్కరించారు.

గురువారం మధురలో జరిగిన ఈ వేడుకలకు పెద్ధ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఎంపీ హేమమాలిని చేసిన నృత్య ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చంగా మీరాబాయిని కళ్లముందుకు తీసుకొచ్చారంటూ ప్రదర్శన చూసిన ప్రేక్షకులు, వీడియో చూసిన నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, కొంతమంది మాత్రం హేమమాలినిని నటిగానే చూస్తామని, అదే ఆమెకు సరిగ్గా నప్పుతుందని చెబుతున్నారు. రాజకీయాలు ఆమెకు సరిపడవని, వదిలేయాలని సూచిస్తున్నారు. నటిగా హేమమాలిని అన్నా, ఆమె చేసే నృత్యమన్నా తనకెంతో ఇష్టమని మరో యూజర్ కామెంట్ పెట్టాడు. అయితే, పొలిటీషియన్ గా ఆమె తనకు నచ్చదని చెప్పాడు. మరికొంతమంది కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు.


More Telugu News