Revanth Reddy: చర్లపల్లి జైల్లో కేసీఆర్ కు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం: రేవంత్ రెడ్డి

Will construct double bedroom for KCR in Charlapalli jail says Revanth Reddy
  • లక్ష కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్ అంటూ రేవంత్ ఆరోపణ
  • ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడని విమర్శ
  • దుబ్బాకను కేసీఆర్, హరీశ్ బొందలగడ్డ చేశారని మండిపాటు
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను బక్కోడినని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకుంటున్నాడని... ఆయన బక్కోడు కాదు, భూబకాసురుడు అని విమర్శించారు. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడని అన్నారు. లక్షకోట్ల దోచుకున్న దొంగ కేసీఆర్ అని.. హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాలను కబ్జా చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్లపల్లి జైల్లో కేసీఆర్ కు డబల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

దుబ్బాక నిధులను మంత్రి హరీశ్ రావు సిద్ధిపేటకు తరలిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే దుబ్బాకకు కేంద్ర నిధులు తెస్తానని, ఏదో చేసేస్తానని హామీలు ఇచ్చి ఏమీ చేయలేదని విమర్శించారు. దుబ్బాకను బంగారు తునక చేస్తానని చెప్పిన కేసీఆర్, హరీశ్ లు... బొందలగడ్డ చేశారని చెప్పారు.
Revanth Reddy
Congress
KCR
Harish Rao
BRS

More Telugu News