T20: ఆస్ట్రేలియాతో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా.. తుది జట్లు ఇవే

India to bowl first in Visakhapatnam T20
  • వైజాగ్ లో ఇండియా - ఆస్ట్రేలియా తొలి టీ20
  • టీమిండియా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్
  • వరల్డ్ కప్ ఆడిన వారిలో ముగ్గురు మినహా అందరికీ విశ్రాంతి
వరల్డ్ కప్ లో ఓటమి బాధ నుంచి ఇంకా బయట పడక ముందే టీమిండియా మరో సిరీస్ కు రెడీ అయింది. ఆస్ట్రేలియా - ఇండియాల మధ్య టీ20 సిరీస్ ప్రారంభమయింది. టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. వరల్డ్ కప్ ఆడిన వారిలో సూర్య, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్ మాత్రమే ఈ టీమ్ లో ఉన్నారు. వైజాగ్ లో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 

టీమిండియా జట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ముఖేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ. 

ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్, మ్యాథ్యూ షార్ట్, జోస్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అరోన్ హార్డీ, స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఇల్లిస్, జేసన్ బెహ్రెన్ డాఫ్, తన్వీర్ సంగా.
T20
Team India
Australia

More Telugu News