Ranbir Kapoor: డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో రణ్ బీర్ కపూర్ : 'యానిమల్' తెలుగు ట్రైలర్ రిలీజ్!

  • సందీప్ రెడ్డి వంగా నుంచి 'యానిమల్'
  • రణ్ బీర్ కపూర్ జోడీ కట్టిన రష్మిక
  • 3 గంటలకి పైగా నిడివి కలిగిన సినిమా 
  • డిసెంబర్ 1వ తేదీన విడుదల

Animal movie telugu trailer released

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ - రష్మిక జంటగా నటించిన 'యానిమల్' సినిమాను డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగా కొంతసేపటి క్రితం ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

ఈ సినిమాలో హీరో చిన్నప్పటి నుంచి విపరీతమైన మానసిక స్థితిని కలిగినవాడిగా కనిపిస్తున్నాడు. ముందుగా తన తండ్రిని ద్వేషిస్తూ వెళ్లిన అతను .. ఆ తరువాత తండ్రి పట్ల ప్రేమతో తాను అనుకున్న పనులు చేయడం చూపించారు. టైటిల్ కి తగినట్టుగానే హీరో వ్యవహరించడం ట్రైలర్ లో కనిపిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు .. ఎమోషనల్ డ్రామా ప్రధానంగా ఈ ట్రైలర్ సాగింది. 

హీరో తండ్రిగా అనిల్ కపూర్ నటించగా, హీరో భార్య పాత్రలో రష్మిక కనిపిస్తోంది. ఇతర ముఖ్యమైన పాత్రలను బాబీ డియోల్ ... శక్తి కపూర్ .. ప్రేమ్ చోప్రా .. సురేశ్ ఒబెరాయ్ పోషించారు. ఈ సినిమా నిడివి 3 గంటల 21 నిమిషాలు ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత నిడివి కలిగిన బాలీవుడ్ సినిమా ఇదేనని చెబుతున్నారు. 

More Telugu News