Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. 906 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

  • మూడేళ్ల కాంట్రాక్ట్.. 30 వేలకు పైగా జీతం
  • ఎలాంటి రాత పరీక్ష లేకుండానే జాబ్
  • కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ తప్పనిసరి
AAICLAS Recruitment 2023 For 906 Security Screener Posts Apply Online

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ లో ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలోని తిరుపతి సహా దేశవ్యాప్తంగా వివిధ సిటీలలో ఉన్న బ్రాంచిలలో ఖాళీల భర్తీకి నియామకాలు చేపట్టనుంది. డిగ్రీ పాస్ అయిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 906 పోస్టులను మూడేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికతో భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది నెలకు రూ.30 వేలు, రెండో ఏడాది రూ.32 వేలు, మూడో ఏడాది రూ.34 వేల చొప్పున నెలనెలా జీతం చెల్లించనున్నట్లు తెలిపింది.

ఈ సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదేనీ డిగ్రీ 60 శాతం (ఎస్సీ, ఎస్టీ 55 శాతం) మార్కులతో పాస్ కావాలని, 27 ఏళ్ల లోపు వయసు, దేశవ్యాప్తంగా ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా వెళ్లేందుకు సిద్దంగా ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఆసక్తికల అభ్యర్థులు ఆన్ లైన్ లో డిసెంబర్ 8 సాయంత్రం 5 లోగా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాలని పేర్కొంది. డిగ్రీలో పొందిన మార్కులు, కంటి పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

More Telugu News