Election Commission: ఏపీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల వివరాలు కోరిన ఈసీ

EC seeks details of govt employees participating in elections
  • ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది కోసం ఏపీ సీఈఓకు ఆదేశాలు
  • సీఈఓ ఆదేశాల మేరకు కలెక్టర్లు జిల్లా అధికారులకు సూచనలు
  • జిల్లాల్లో టీచర్ల వివరాలు కోరుతూ విద్యాశాఖ అధికారుల ఆదేశాలు
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఏపీ సీఈఓను కోరింది. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది కోసం వివరాలను ఇవ్వాలని కోరింది. సీఈఓ ఆదేశాలతో అన్ని శాఖల ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని టీచర్ల వివరాలు ఇవ్వాలనీ ఆదేశించారు. ఈ నెల 25 లోపు వివరాలు పంపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
Election Commission
Andhra Pradesh

More Telugu News