చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదు... ముఖ్యమంత్రి కాలేడు: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ నిప్పులు
- రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్పారన్న కేసీఆర్
- రేవంత్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావని విమర్శలు
- కాంగ్రెస్‌లో పదిహేనుమంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారన్న కేసీఆర్
కాంగ్రెస్ పార్టీలో పదిహేనుమంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడని చెప్పారు. రేవంత్‌కు ఓ నీతి, పద్ధతి లేవని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి వ్యవసాయం తెలుసా? ఎప్పుడైనా వ్యవసాయం చేశాడా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఓ భూకబ్జాదారు అని, భూములు ఎక్కడపడితే అక్కడ కబ్జాలు పెట్టాడని ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే విజయమని, ఎలాంటి అనుమానం లేదన్నారు. కొడంగల్ నుంచి గతంలో బాగా వలసలు ఉండేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్నారని, ఆ స్థానంలో భూమాతను తెస్తామని చెబుతున్నారని, కానీ అది భూమేత అని దుయ్యబట్టారు.