Thandel: చైతూ బర్త్ డే స్పెషల్ గా 'తండేల్' ఫస్టు లుక్ రిలీజ్!

  • చందూ మొండేటి నుంచి 'తండేల్'
  • మత్స్యకారుల జీవితం నేపథ్యంలో సాగే కథ 
  • మరోసారి జోడీకడుతున్న చైతూ - సాయి పల్లవి 
  • సంగీతాన్ని అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్
Thandel movie update

నాగచైతన్య - చందూ మొండేటి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'సవ్యసాచి' ఆశించిన స్థాయిలో ఆడలేదు. చైతూకి తప్పకుండా ఒక హిట్ ఇస్తానని చెప్పిన చందూ మొండేటి, ఆయనతో ఓ సినిమా చేస్తున్నాడు  .. ఆ సినిమా పేరే 'తండేల్'. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో నడిచే కథ ఇది. మత్స్యకారుడిగానే ఈ సినిమాలో చైతూ కనిపించనున్నాడు. 
  
ఈ సినిమాకి సంబంధించిన చైతూ ఫస్టు లుక్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. రేపు చైతూ బర్త్ డే కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదిలారు. చేపల వేటకి వెళ్లే బోట్ లో .. మాస్ లుక్ తోనే చైతూ కనిపిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2పై నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ల పద్ధతులు .. నమ్మకాలు .. మాట తీరు ఎలా ఉంటాయనే విషయంపై చైతూ కొంత స్టడీ చేశాడు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా సాయిపల్లవి కనిపించనుంది. 'లవ్ స్టోరీ' హిట్ తరువాత ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు ఉంటాయి.

More Telugu News