Konda Surekha: బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్లి కాంగ్రెస్ కు ఓటేయాలని కోరిన కొండా సురేఖ.. వీడియో ఇదిగో!

Congress Candidate Konda Surekha Went To BRS Office To Ask Votes In Warangal East
  • వరంగల్ ఎన్నికల ప్రచారంలో వింత దృశ్యం
  • భలే ర్యాగింగ్ చేశారంటూ వీడియో ట్వీట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
  • సురేఖ తీరుతో ఆశ్చర్యపోయిన బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో నాయకులు ప్రచారం ఉద్ధృతం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ తమకే ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ వినూత్నంగా ప్రచారం చేశారు. ఏకంగా బీఆర్ఎస్ ప్రాంతీయ కార్యాలయంలోకి వెళ్లి మరీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు. చేతి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అక్కడున్న నేతలను కోరారు. కొండా సురేఖ తీరుతో బీఆర్ఎస్ నేతలు నివ్వెరపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ర్యాగింగ్ లెవల్ 100 పర్సెంట్ అంటూ కామెంట్ చేసింది. పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. కొండా సురేఖ ప్రచారంతో బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విస్తుపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి సురేఖ బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Konda Surekha
BRS Office
Ask Votes
Warangal East
Congress Candidate
Telangana
assembly elections

More Telugu News