Calling Sahasra: ఈ సారి నవ్వించను .. భయపెడతాను: సుడిగాలి సుధీర్

Sudigali Sudheer Interview
  • సుధీర్ హీరోగా రూపొందిన 'కాలింగ్ సహస్ర'
  • సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • కథానాయికగా డోలీషా పరిచయం 
  • డిసెంబర్ 1వ తేదీన సినిమా విడుదల

సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పుకోవలసిన పనిలేదు. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ ఆయనను వెండితెరకి తీసుకుని వెళ్లింది. ఆయన హీరోగా 'కాలింగ్ సహస్ర' సినిమా రూపొందింది. ఈ సినిమాతో కథానాయికగా 'డోలీషా' పరిచయమవుతోంది. డిసెంబర్ 1వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.

తాజా ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ .. "ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ... మంచి లవ్ స్టోరీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి .. కొంచెం ఫన్ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు భయపెడతాయి కూడా. ఈ సినిమాలో నా పాత్ర కామెడీ చేయదు .. సీరియస్ గానే సాగుతుంది. అందువలన నేను కొత్తగా అనిపిస్తాను" అని అన్నాడు. 

"ఈ సారి నేను చేసే ప్రయోగంగానే ఈ సినిమాను భావిస్తాను. తప్పకుండా నన్ను ఈ తరహా పాత్రలలో ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది" అన్నాడు. ఇక హీరోయిన్ డోలీషా మాట్లాడుతూ, సుధీర్ కి ఉన్న క్రేజ్ గురించి విన్నాను. ఆ తరువాత ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను. ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది" అని చెప్పింది.

Calling Sahasra
Sudigali Sudheer
Dollysha

More Telugu News