Ghol Fish: గుజరాత్ రాష్ట్ర చేపగా ‘ఘోల్ ఫిష్’.. ఒక్క చేప ధర ఏకంగా ఐదు లక్షలు!

  • ప్రకటించిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్
  • ఘోల్‌ఫిష్ మాంసం, ఎయిర్ బ్లాడర్‌కు విపరీతమైన డిమాండ్
  • మాంసాన్ని బీర్, వైన్ తయారీకి.. బ్లాడర్‌ను ఔషధాల తయారీకి వాడకం 
Ghol fish declared state fish of Gujarat

‘ఘోల్‌ ఫిష్’ను గుజరాత్ రాష్ట్ర చేపగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు. అహ్మదాబాద్‌లో జరిగిన రెండు రోజుల గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్‌లో ఆయనీ ప్రకటన చేశారు. భారత్‌లోని అతిపెద్ద చేపల్లో ఘోల్ చేప కూడా ఒకటి. గుజరాత్, మహారాష్ట్రలోని సముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. 

మాంసం, దాని ఎయిర్ బ్లాడర్ కారణంగా ఈ చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. బీర్, వైన్ తయారీలో దీనిని ఉపయోగిస్తారు. అలాగే, దాని మూత్రపు తిత్తులు (ఎయిర్ బ్లాడర్)ను ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఘోల్ ఫిష్ మాంసం, ఎయిర్ బ్లాడర్‌ను వేర్వేరుగా విక్రయిస్తారు. ముంబై నుంచి ఎయిర్ బ్లాడర్ విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది. 

ఈ చేప పొడవు దాదాపు మీటరున్నర ఉంటుంది. పొడవును బట్టి ఒక్కో చేప ధర రూ. 5 లక్షల వరకు పలుకుతుంది. ఇవి కనుక తమ వలలకు చిక్కాయంటే జాలర్లకు పండుగ అన్నట్టే.

More Telugu News