నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ జోరు... రూ.751 కోట్ల ఆస్తుల అటాచ్
- యంగ్ ఇండియన్ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యకలాపాలు
- నేషనల్ హెరాల్డ్ కు ప్రచురణకర్తగా ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్
- యంగ్ ఇండియన్ లో ప్రమోటర్లుగా సోనియా, రాహుల్ గాంధీ
- ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి
ఈ కేసులో మనీలాండరింగ్ కోణం కూడా ఉన్న నేపథ్యంలో ఈడీ వేగం పెంచింది. తాజాగా, రూ.751.90 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థకు పలు నగరాల్లో రూ.661.69 కోట్ల ఆస్తులు ఉన్నాయని... యంగ్ ఇండియన్ సంస్థకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ లో రూ.90.21 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయని ఈడీ వివరించింది.