Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బిత్తిరి సత్తి సెటైరికల్ వీడియో... ఇదిగో

  • టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బిత్తిరి సత్తి వీడియో రీక్రియేషన్
  • నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
  • ట్వీట్ చేసిన బీఆర్ఎస్ టెక్ సెల్  
Bithiri Sathi satirical video
Listen to the audio version of this article

బిత్తిరి సత్తి సెటైరికల్ వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వేదికలపై నాయకులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారనే అభిప్రాయంతో చేసిన వీడియో ఇది. దీనిని బీఆర్ఎస్ టెక్ సెల్ నిన్న ట్వీట్ చేసింది. ఇటీవల కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో ఫోటోలు దిగే సమయంలో రేవంత్ రెడ్డి... నాయకులను చేయి చేసుకున్నట్లుగా, పక్కకు నెట్టేసినట్లుగా వీడియోలు వెలుగు చూశాయి. దీనిని బిత్తిరి సత్తి ఇమిటేట్ చేస్తూ సెటైరికల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో పైన బిత్తిరి సత్తి రీక్రియేట్ చేసిన సెటైరికల్ వీడియో, కింది భాగంలో రేవంత్ రెడ్డి బిహేవియర్‌కు సంబంధించిన వీడియోను పెట్టారు.

More Telugu News