TDP: ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసిన టీడీపీ సీనియర్ నేతలు

TDP leaders met ECI in Delhi
  • ఢిల్లీ వెళ్లిన టీడీపీ నేతలు
  • ఏపీలో ఓటరు జాబితాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి ఫిర్యాదు
  • టీడీపీ మద్దతుదారుల ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణ
  • చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి 
టీడీపీ సీనియర్ నేతలు ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో ఓటరు జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో యనమల రామకృష్ణుడు, కనకమేడల రవీంద్ర కుమార్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు. 

ఏపీలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని ఈసీకి వివరించారు. టీడీపీ మద్దతుదారుల ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారని, తప్పుడు ఓటర్ల జాబితాలు రూపొందిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
TDP
ECI
New Delhi
YSRCP
Andhra Pradesh

More Telugu News