Joju George: ఓటీటీ సెంటర్ కి మరో మలయాళ థ్రిల్లర్ .. 'పులిమడ'

  • జోజు జార్జ్ హీరోగా రూపొందిన 'పులిమడ'
  • ఆయన సరసన నటించిన ఐశ్వర్య రాజేశ్ 
  • క్రితం నెలలో థియేటర్లకు వచ్చిన సినిమా
  • ఈ నెల 23 నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్

Pulimada movie OTT streaming date confirmed
Listen to the audio version of this article

మలయాళం నుంచి ఇప్పుడు ఓటీటీ సెంటర్ కి మరో థ్రిల్లర్ సినిమా రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'పులిమడ'. రాజేశ్ దామోదరన్ నిర్మించిన ఈ సినిమాకి, సజన్ దర్శకత్వం వహించాడు. ఇషాన్ దేవ్ బాణీలను సమకూర్చిన ఈ సినిమాకి. అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతాన్ని అందించాడు. 

ఈ సినిమాలో జోజు జార్జ్ కథానాయకుడిగా నటించగా, అతని భార్య పాత్రలో ఐశ్వర్య రాజేశ్ కనిపిస్తుంది. అక్టోబర్ 26వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 23వ తేదీ నుంచి ఐదు భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ను జరుపుకోనుంది. 

ఈ సినిమాలో హీరో మానసిక స్థితి సరిగ్గా లేని తన తల్లి ఆలనా పాలన చూస్తుంటాడు. కొన్ని కారణాల వలన  అతని భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోతుంది. ఊహించని ఆ సంఘటన హీరో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అప్పుడు అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది మిగతా కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి. 

More Telugu News