Dharmana Prasada Rao: రోడ్లు బాగోలేవని వైసీపీని వద్దనుకోవద్దు.. రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా?: ధర్మాన ప్రసాదరావు

Dont go away from YSRCP by looking at roads says Dharmana Prasada Rao
  • మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన
  • విశాఖ రాజధాని అయితే జీవన ప్రమాణాలు పెరుగుతాయని వ్యాఖ్య
  • ఏపీ కంటే తక్కువ ధరలు ఉన్న రాష్ట్రం ఏదో చెప్పాలని ప్రశ్న

ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లు బాగోలేవని వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దని ఆయన అన్నారు. రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? అని ఆయన ప్రశ్నించారు. చెన్నై, కర్నూలు రాష్ట్ర రాజధానులుగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడకు వెళ్లడానికి రెండు రోజులు పట్టేదని చెప్పారు. విశాఖ కంటే గొప్ప అర్హతలు ఉన్న రాజధాని ఏపీలో లేదని అన్నారు. విశాఖ రాజధాని వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో విద్యుత్తు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని... మన కంటే ధరలు తక్కువ ఉన్న రాష్ట్రం ఏదో చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన ఉపయోగం లేని పనులు ఏమిటో టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక సాధికార యాత్రలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News