Nani: రాహుల్.. ఏంది వా ఇది! కేసీఆర్ స్టైల్లో హీరో నాని ‘ప్రెస్ మీట్’!

  • ‘హాయ్ నాన్న’ మూవీని వినూత్న రీతిలో ప్రమోట్ చేస్తున్న హీరో నాని
  • కేసీఆర్ మేనరిజమ్స్‌ను అనుకరిస్తూ మూవీ వివరాలు వెల్లడి 
  • విలేకరి రాహుల్ ప్రస్తావనతో నెట్టింట నవ్వులు
Nani promotes Hai nanna movie imitating kcr
Listen to the audio version of this article

శౌర్య శివ డైరెక్షన్‌లో నానీ హీరోగా రూపొందిన చిత్రం ‘హాయ్ నాన్న’. ఇది నానీకి 30వ మూవీ. డిసెంబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే, ప్రెస్ మీట్లలో సీఎం కేసీఆర్ మేనరిజమ్స్, సంభాషణా శైలిని అనుకరిస్తూ నాని తన చిత్రాన్ని ప్రమోట్ చేశారు. విలేకరి రాహుల్ ప్రస్తావన తెస్తూ నాని చేసిన వీడియో జనాలను ఆకట్టుకుంటోంది. 

ఏంది వా.. రాహుల్..అంటూ మొదలెట్టిన నానీ కేసీఆర్‌ను ఇమిటేట్ చేస్తూ సినిమా వివరాలన్నీ చెప్పేశాడు. పంచాతి పెట్టొద్దని,  సినిమా పోస్ట్ పోన్ కాదని, డిసెంబర్ 7న దావత్ చేసుకోవాలని చెప్పాడు. ప్రీ ప్రోన్‌కు పోస్ట్ పోన్‌కు తేడా తెలవకపోతే ఎలా? అంటూ మరో పంచ్ వేశాడు. దీంతో, నానీ ప్రెస్ మీట్ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

More Telugu News