Nara Lokesh: మళ్లీ ప్రారంభం కానున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. ఎప్పటి నుంచి అంటే..!

Nara Lokesh Yuvagalam Padayatra to restart on Nov 24
  • చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన యువగళం యాత్ర
  • సెప్టెంబర్ 9న రాజోలు మండలంలో నిలిచిన యాత్ర
  • ఈ నెల 24న యాత్ర పునఃప్రారంభం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మరోవైపు, చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన టీడీపీ యాత్రలు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 24న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9న కోనసీమ జిల్లా రాజోలు మండలంలో యువగళం యాత్ర ఆగిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచే పునఃప్రారంభవం కానుంది. రేపు సాయంత్రానికల్లా యాత్రకు సంబంధించిన సమన్వయకర్తలు, వాలంటీర్లు రాజోలుకు చేరుకోవాలని పార్టీ నాయకత్వం కోరింది. 

లోకేశ్ యాత్ర డిసెంబర్ చివరి వారం వరకు కొనసాగనుంది. యాత్ర పూర్తి అయ్యే సమయానికి ఆయన 3,550 కిలోమీటర్లు నడిచే అవకాశం ఉంది. యువగళం పాదయాత్ర రాజోలు నుంచి పి. గన్నవరం, అమలాపురం, కొత్తపేట, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, రాజమండ్రి మీదుగా విశాఖ దిశగా సాగుతుంది.
Nara Lokesh
Telugudesam
Yuva Galam Padayatra
Chandrababu

More Telugu News