IndiGo flight: ఇండిగో విమానంలో మద్యం మత్తులో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. ప్రయాణికుడి అరెస్ట్

  • విమానాల్లో శ్రుతిమించుతున్న ప్రయాణికుల ఆగడాలు
  • అనుచిత ప్రవర్తనలతో పతాక శీర్షికల్లోకి
  • తాజాగా జైపూర్-బెంగళూరు విమానంలో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన
  • విమానాల్లో మద్యం పంపిణీపై వ్యక్తమవుతున్న ఆందోళనలు
passenger arrested for misbehaving with female crew onboard IndiGo flight

విమానాల్లో ప్రయాణికుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. విమాన సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, జైపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం 6ఈ556లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ ప్రవర్తన మార్చుకోలేదు సరికదా మరింతగా చెలరేగిపోయాడు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమనాశ్రయంలో విమానం ల్యాండయ్యాక నిందితుడిని పోలీసులకు అప్పగించారు. 

ఇటీవల కొన్ని నెలల క్రితం ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో సహ ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఈ ఘటనను మర్చిపోకముందే అలాంటిదే మరోటి జరిగింది. గువాహటి-ఢిల్లీ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో వీరంగమేశాడు. క్యాబిన్‌లో వాంతులు చేసుకోవడంతోపాటు మలవిసర్జన కూడా చేశాడు. ఈ వరుస ఘటనలతో విమానాల్లో మద్యం సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది.

More Telugu News