CM Jagan: సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన రద్దు.. కారణం ఇదే

CM Jagan Nellore district visit cancelled due to rains
  • వర్షం కారణంగా సూళ్లూరుపేట నియోజకవర్గం పర్యటన రద్దు
  • హెలికాప్టర్‌ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో నిర్ణయం
  • రూ.150 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన పర్యటన    
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో మంగళవారం చేపట్టాల్సిన పర్యటన రద్దయింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.150 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీఎం పర్యటించాల్సి ఉంది. అయితే వర్షం ప్రభావంతో హెలికాఫ్టర్ ప్రయాణానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో సీఎం పర్యటనను రద్దు చేసినట్టు సమాచారం. కాగా సీఎం పర్యటన కోసం సూళ్లూరుపేటలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు రూ.150 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించారు. 
CM Jagan
YS Jagan
YSRCP
Nellore District
Andhra Pradesh

More Telugu News