Hasin Jahan: ఇంతకీ షమీ మాజీ భార్య ఇన్ స్టాగ్రామ్ పోస్టు టీమిండియా గురించేనా...?

  • వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి
  • ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో పోస్టు చేసిన షమీ మాజీ భార్య హసీన్ జహాన్
  • హసీన్ పోస్టుపై సోషల్ మీడియాలో చర్చ
Shami former wife Hasin Jahan video went viral
Listen to the audio version of this article

వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో పేసర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ పెట్టిన సోషల్ మీడియా పోస్టు వైరల్ అవుతోంది. హసీన్ జహాన్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో ఓ పోస్టు పెట్టింది. అందులో హసీన్ జహాన్ కనిపిస్తుండగా, మంచి మనసున్న వాళ్లే అంతిమంగా విజయం సాధిస్తారు అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఓ డైలాగ్ వినిపిస్తుంది. 

అయితే, ఈ రీల్ ఎవరిని ఉద్దేశించి అనేది చర్చనీయాంశంగా మారింది. ఆమె టీమిండియాను ఉద్దేశించి ఈ పోస్టు పెట్టింది అంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. షమీపై కోపం ఉంటే ఇలాంటి పోస్టు పెట్టాలా...? అని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

కొన్నాళ్లుగా షమీ, హసీన్ జహాన్ వేర్వేరుగా ఉంటున్నారు. షమీపై తీవ్ర ఆరోపణలు చేయడం ద్వారా హసీన్ జహాన్ అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. షమీ మెరుగైన క్రికెటర్ లా పేరు తెచ్చుకున్నట్టే మంచి మనిషిగా ఉండుంటే తమ జీవితాలు ఇలా ఉండేవి కావని హసీన్ జహాన్ ఇటీవల పేర్కొంది.

More Telugu News