Vaishnav Tej: అటు రొమాన్స్ .. ఇటు మాస్ యాక్షన్ తో 'ఆదికేశవ' .. ట్రైలర్ రిలీజ్!

Adikeshava Trailer Released

  • 'ఆదికేశవ'గా వైష్ణవ్ తేజ్
  • ఆయన జోడీగా సందడి చేయనున్న శ్రీలీల
  • ఈ నెల 24వ తేదీన రిలీజ్ 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్ 
  • ఆసక్తిని పెంచుతున్న ట్రైలర్


వైష్ణవ్ తేజ్ హీరోగా సితార నాగవంశీ - సాయి సౌజన్య 'ఆదికేశవ' సినిమాను నిర్మించారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల నటించింది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచారు. 

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ తో కూడిన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జోజు జార్జ్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. రాధిక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తోంది. యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయనే విషయం అర్థమవుతోంది. 

ఈ కథ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. 'క్వారీ' తవ్వకానికి అడ్డొస్తుందనే ఉద్దేశంతో, ప్రాచీన కాలానికి చెందిన ఒక శివాలయాన్ని పడగొట్టడానికి విలన్ ప్రయత్నిస్తాడు. అందుకు హీరో అడ్డుపడతాడు. ఆ అంశం చుట్టూనే ఈ కథ నడుస్తుంది. రాధిక .. జోజు జార్జ్ తో పాటు అపర్ణదాస్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనుంది.

Vaishnav Tej
Sreeleela
Joju George
Radhika
  • Loading...

More Telugu News