Karthi: రెండు సీక్వెల్స్ ను పట్టాలెక్కిస్తున్న కార్తి!

  • 2017లో వచ్చిన 'ఖాకి' పెద్ద హిట్ 
  • 2019లో విజయాన్ని సాధించిన 'ఖైదీ'
  • సీక్వెల్స్ దిశగా జరుగుతున్న సన్నాహాలు 
  • వచ్చే ఏడాదిలో పట్టాలెక్కుతున్న ప్రాజెక్టులు

Karthi Sequel Movies
Listen to the audio version of this article

ఇప్పుడు ఎక్కడ చూసినా సీక్వెల్స్ జోరు నడుస్తోంది. కొత్త కథలతో ప్రయోగాలు చేయడం కంటే, ఆల్రెడీ జనాలకు కనెక్ట్ అయిన కంటెంట్ అయితే థియేటర్స్ కి జనాలను రప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అందువలన సీక్వెల్స్ చేయడానికి హీరోలంతా ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. కార్తి కూడా అదే బాటలో ముందుకు వెళుతున్నాడు.

కార్తి హీరోగా 2017లో 'ఖాకి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాకి, వినోత్ దర్శకత్వం వహించాడు. పోలీస్ ఆఫీసర్ గా కార్తి నటించిన ఈ సినిమా, సంచలన విజయాన్ని నమోదు చేసింది. నేరస్థులను పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత రిస్క్ చేశాడనే ఈ కథ అనేక మలుపులు తిరుగుతుంది. 

ఇక ఆ తరువాత కార్తి చేసిన 'ఖైదీ' కూడా భారీ విజయాన్ని సాధించింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను పట్టాలెక్కించే పనిలో కార్తి ఉన్నాడు. 'జపాన్' సినిమాతో పరాజయాన్ని మూటగట్టుకున్న ఆయన, సాధ్యమైనంత త్వరగా హిట్ ను తన ఖాతలో వేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. 

More Telugu News