Manda Krishna Madiga: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మన మద్దతు: ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగ లేఖ

  • ఎస్సీ ఆర్గనైజేషన్‌లకు మంద కృష్ణ మాదిగ లేఖ
  • ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందన్న మంద కృష్ణ
  • బీఆర్ఎస్ ఎస్సీలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపణ
  • బీజేపీకి మద్దతివ్వాలని లేఖలో పేర్కొన్న మంద కృష్ణ
MRPS extends support to BJP in Assembly elections

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికింది. తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ... మాదిగ సామాజిక వర్గానికి, ఎస్సీలలోని ఇతర వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మాదిగ ఆర్గనైజేషన్‌లకు మంద కృష్ణ లేఖలు రాశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ మనల్ని మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లు కానీ... ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ పదేళ్లు కానీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపలేదని మండిపడ్డారు. మనకు అనుకూలంగా వచ్చిన పలు నివేదికలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు వెన్నుపోటు పొడిచారన్నారు. కనీసం ఆయన మంత్రివర్గంలో కూడా ఎస్సీలకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణలో ఎస్సీలు ఎక్కువ అని, అందులోనూ మాదిగలు ఎక్కువ అని, కానీ తమకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. అందుకే నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మన మద్దతు బీజేపీకేనని మంద కృష్ణ మాదిగ రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో ఎస్సీలు 17 శాతం ఉంటారు. అందులో 60 శాతం మాదిగలు ఉంటారు.

More Telugu News