ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్
- 80 శాతం వేరియబుల్ పే ప్రకటించిన ఇన్ఫోసిస్
- లెవెల్ 6, అంతకంటే దిగువన ఉన్న ఉద్యోగులకు బోనస్ అని ప్రకటన
- బోనస్ పంపిణీని యూనిట్ మేనేజర్లు నిర్ణయిస్తారని వెల్లడి
కాగా, ‘ వారానికి 70 పనిగంటలు’ సూచనతో ఇటీవల సంచలనం స్పృష్టించిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తాజాగా వ్యాపారవేత్తగా మారడం కష్టంతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. ‘‘సాప్ట్‌వేర్ ఇంజినీర్, లేదా ఫైనాన్షియల్ ఎనలిస్ట్ కావడం సులభమే కానీ పారిశ్రామికవేత్తగా కొనసాగడం కష్టంతో కూడుకున్నది. ఎంతో శ్రమ అవసరం. భారత్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయితే, దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అనూకూల వాతావరణం కోసం భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.