earthquake: మహారాష్ట్రలో 3.5 తీవ్రతతో భూకంపం

  • సోమవారం తెల్లవారుజామున భయపెట్టిన భూకంపం
  • తెలంగాణ, కర్ణాటకలోనూ ప్రకంపనలు
  • నమోదు కాని ప్రాణ, ఆస్తి నష్టం
earthquake recorded in Maharashtra

తాజాగా మహారాష్ట్రలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత గల భూకంపం నమోదయ్యింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. సోమవారం ఉదయం 5.09 గంటల సమయంలో ఇది సంభవించిందని, భూఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం హింగోలి జిల్లా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 255 కిలోమీటర్లు, నాగ్‌పూర్‌కు 265 కిలోమీటర్ల దూరంలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాగా ఈ భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదుకాలేదు.

More Telugu News