Rosalynn Carter: అమెరికా మాజీ ప్రథమ మహిళ రోజలిన్ కార్టర్ కన్నుమూత

Former US First Lady Rosalynn Carter dies at 96

  • డిమెన్షియాతో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచిన రోజలిన్(96)
  • మానవతావాదిగా పేరు తెచ్చుకున్న రోజలిన్
  • భర్తతో కలిసి కార్టర్ సెంటర్ ఏర్పాటు 
  • భార్య మృతిపై మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ తీవ్ర విచారం

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అర్ధాంగి రోజలిన్ కార్టర్(96) కన్నుమూశారు. కొంతకాలంగా డిమెన్షియాతో బాధపడుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారని ది కార్టర్ సెంటర్ తాజాగా ప్రకటించింది. 

మానసిక ఆరోగ్యం ప్రాధాన్యత గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు రోజలిన్ తన భర్త జిమ్మీ కార్టర్‌తో కలిసి కార్టర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తన సేవా కార్యక్రమాలతో మానవతావాదిగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. 77 ఏళ్లుగా వైవాహిక బంధంలో ఉన్న జిమ్మీ, రోజలిన్ అమెరికా చరిత్రలో ప్రత్యేక స్థానం పొందారు. కాగా, భార్య మృతిపై జిమ్మీ కార్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన విజయాలలో ఆమె సమాన భాగస్వామి అని కొనియాడారు.

More Telugu News