Australia: ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కు వరల్డ్ కప్ బహూకరించిన ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని

  • వరల్డ్ కప్-2023 విజేత ఆస్ట్రేలియా 
  • రికార్డు స్థాయిలో 6వ సారి టైటిల్ కైవసం
  • మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని మార్లెస్ చేతుల మీదుగా కప్ అందుకున్న కమిన్స్
PM Modi handed over the world cup to Aussies skipper Pat Cummins

దాదాపు 45 రోజుల పాటు సాగిన వరల్డ్ కప్ సంరంభం ముగిసింది. పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వన్డే ఫార్మాట్ లో ప్రపంచ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆసీస్ జట్టు 6 వికెట్లతో ఆతిథ్య టీమిండియాను ఓడించింది. ఈ మ్యాచ్ కు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ విజేత కెప్టెన్ పాట్ కమిన్స్ కు వరల్డ్ కప్ ను బహూకరించారు. 6వ సారి వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టును వారు అభినందించారు.

More Telugu News