Team India: 3 వికెట్లు పడగొట్టి ఆసీస్ ను ఒత్తిడిలోకి నెట్టిన టీమిండియా

  • అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్
  • టీమిండియా 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్
  • 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్
  • రెండు వికెట్లు తీసిన బుమ్రా, షమీకి 1 వికెట్
Team India put Aussies into pressure after got three wickets

వరల్డ్ కప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. 241 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్ 47 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

తొలుత 7 పరుగులు చేసిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను మహ్మద్ షమీ ఓ స్వింగ్ డెలివరీ తో  అవుట్ చేశాడు. మామూలుగా కొత్తబంతితో బుమ్రా, సిరాజ్ బౌలింగ్ చేస్తారు. కానీ, ఇవాళ పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ... బుమ్రాతో తొలి ఓవర్ వేయించి, రెండో ఓవర్ లోనే షమీని బౌలింగ్ కు దింపాడు. ఈ ఎత్తుగడ సత్ఫలితాన్ని ఇచ్చింది. షమీ వస్తూనే వార్నర్ వికెట్ తీసి టీమిండియా శిబిరంలో ఆనందం నింపాడు. 

వన్ డౌన్ లో వచ్చిన మిచెల్ మార్ష్ ధాటిగా ఆడుతుండడంతో కొద్దిగా ఆందోళన నెలకొంది. మార్ష్ 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 15 పరుగులు చేశాడు. అయితే, బుమ్రా ఆఫ్ సైడ్ విసిరిన బంతిని షాట్  ఆడబోయి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం స్టీవ్ స్మిత్ (4) ను బుమ్రా ఎల్బీడబ్ల్యూ చేయడంతో ఆసీస్ మూడో వికెట్ చేజార్చుకుంది. 

స్మిత్ నాటౌట్ అని ఆ తర్వాత రీప్లేలో కనిపించింది. స్మిత్ డీఆర్ఎస్ కు వెళ్లకపోవడంతో ఆసీస్ శిబిరం ఉసూరుమంది. ప్రస్తుతం ఆసీస్ 7 ఓవర్లు ముగిసేసరికి 3వికెట్లకు 47 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (10 బ్యాటింగ్), లబుషేన్ (0 బ్యాటింగ్) ఉన్నారు.

More Telugu News