బాలీవుడ్ లో విషాదం... స్టార్ డైరెక్టర్ కన్నుమూత

Bollywood director Sanjay Gadhvi passed away
  • 'ధూమ్' ఫేమ్ సంజయ్ గాధ్వి మృతి
  • హార్ట్ అటాక్ అంటున్న కుమార్తె
  • మరో మూడు రోజుల్లో పుట్టినరోజు ఉండగా గాధ్వి కన్నుమూత

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ గాధ్వి కన్నుమూశారు. ఈ ఉదయం 9.30 గంటలకు గాధ్వి ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారని కుమార్తె సంజీనా వెల్లడించారు. అయితే ఆయనకు అనారోగ్యం ఏమీ లేదని, బహుశా గుండెపోటుకు గురై ఉంటారని భావిస్తున్నామని తెలిపారు. ఇటీవల కాలంలో ఆయనకు ఆరోగ్య సమస్యలేవీ లేవని ఆమె వెల్లడించారు. కాగా, సంజయ్ గాధ్వి మరో మూడు రోజుల్లో పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉండగా, అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. 

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు ధూమ్, ధూమ్-2 చిత్రాలకు గాధ్వినే దర్శకుడు. గాధ్వి వయసు 56 సంవత్సరాలు. ఆయన 2000 సంవత్సరంలో తేరే లియే చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. 2002లో మేరే యార్ కి షాదీ హై చిత్రంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కెరీర్ లో చివరిగా ఆపరేషన్ పరిందే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2020లో వచ్చింది. 

సంజయ్ గాధ్వికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Advertisement
Sanjay Gadhvi
Death
Director
Bollywood

More Telugu News