బర్రెలక్క ప్రచారానికి యానాం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రూ. లక్ష సాయం
- కొల్లపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి శిరీష
- సోషల్ మీడియాలో బర్రెలక్కగా పాప్యులర్
- బర్రెలక్కకు అనూహ్యంగా పెరుగుతున్న మద్దతు
- లక్ష రూపాయల విరాళం పంపిన మల్లాడి కృష్ణారావు
- మున్ముందు కూడా అండగా ఉంటానని హామీ
కులమతాలకు అతీతంగా, డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికల్లో యువత పోటీచేసి గెలవాలన్న ఉద్దేశంతో బరిలో నిలిచిన బర్రెలక్కకు పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, యానాంకు చెందిన మల్లాడి కృష్ణారావు నిన్న లక్ష రూపాయల విరాళం పంపించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. శిరీషతో మాట్లాడానని చెప్పారు. ఫలితం ఎలా వచ్చినా నిరాశ చెందవద్దని చెప్పానని పేర్కొన్నారు. బీఈడీ వంటి కోర్సులు చదువుకోవాలని, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలనుకుంటే తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చినట్టు తెలిపారు.