Barrelakka: బర్రెలక్క ప్రచారానికి యానాం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రూ. లక్ష సాయం

Puducherry politician Malladi Krishna Rao sent Rs 1 lakh  to Barrelakka for convassing
  • కొల్లపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి శిరీష
  • సోషల్ మీడియాలో బర్రెలక్కగా పాప్యులర్
  • బర్రెలక్కకు అనూహ్యంగా పెరుగుతున్న మద్దతు
  • లక్ష రూపాయల విరాళం పంపిన మల్లాడి కృష్ణారావు
  • మున్ముందు కూడా అండగా ఉంటానని హామీ
సోషల్ మీడియాలో పాప్యులర్ అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బర్రెలక్క అలియస్ కర్నె శిరీష ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తిచేసిన శిరీష ఉద్యోగం లేకపోవడంతో గేదెలు కాస్తుండడంతో అందరూ ఆమెను బర్రెలక్కగా పిలవడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న బర్రెలక్కకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నాయి.

కులమతాలకు అతీతంగా, డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికల్లో యువత పోటీచేసి గెలవాలన్న ఉద్దేశంతో బరిలో నిలిచిన బర్రెలక్కకు పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, యానాంకు చెందిన మల్లాడి కృష్ణారావు నిన్న లక్ష రూపాయల విరాళం పంపించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. శిరీషతో మాట్లాడానని చెప్పారు. ఫలితం ఎలా వచ్చినా నిరాశ చెందవద్దని చెప్పానని పేర్కొన్నారు. బీఈడీ వంటి కోర్సులు చదువుకోవాలని, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలనుకుంటే తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చినట్టు తెలిపారు.
Barrelakka
Kollapur
Telangana Elections
Malladi Krishna Rao
Puducherry

More Telugu News