Ritu Varma: వరుణ్-లావణ్య పార్టీలో రీతూ వర్మ.. అలాంటిదేమీ లేదన్న నటుడు వైష్ణవ్ తేజ్

  • వరుణ్, లావణ్య ప్రీవెడ్డింగ్ పార్టీలో మెరిసిన నటి రీతూ వర్మ
  • ఓ హీరోతో ఆమె రిలేషన్‌లో ఉందంటూ నెట్టింట రూమర్స్
  • లావణ్యకు రీతూ స్నేహితురాలు కాబట్టే పార్టీకి వచ్చిందన్న వైష్ణవ్ తేజ్
Vaishnav tej issues clarity regarding rumours over Ritu varma

నటుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం ఇటీవల ఇటలీలో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అంతకుముందు, ఈ జంటకు మెగా, అల్లు కుటుంబాలు ప్రీవెడ్డింగ్‌ పార్టీలు ఏర్పాటు చేశాయి. అయితే, అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీకి నటి రీతూ వర్మ హాజరు కావడం హాట్ టాపిక్‌గా మారింది. మెగా కాంపౌండ్‌లోని ఓ హీరోతో ఆమె రిలేషన్ షిప్‌లో ఉందంటూ నెట్టింట చర్చ మొదలైంది. 

ఈ అంశంపై నటుడు వైష్ణవ్ తేజ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. లావణ్య త్రిపాఠీకి రీతూ మంచి స్నేహితురాలు కాబట్టే ఆమె పార్టీకి వచ్చిందని స్పష్టం చేశారు. ఆ కారణంతోనే పెళ్లి వేడుకల్లో సందడి చేసిందన్నారు. అంతకు మించి మరేమీ లేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు.

More Telugu News