Sri Padmavathi Amma Vaaru: తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పద్మావతి అమ్మవారికి కోట్ల విలువైన సారె

  • తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు
  • నవంబరు 10న ప్రారంభమైన కార్తీక బ్రహ్మోత్సవాలు
  • రూ.2.5 కోట్ల విలువైన బంగారు కాసుల మాల, యజ్ఞోపవీతం సమర్పించిన టీటీడీ
  • సారెను తలపై మోస్తూ ఆలయానికి తీసుకువచ్చిన భూమన, ధర్మారెడ్డి
TTD offers valuable ornaments to Padmavathi Ammavaaru

తిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. నవంబరు 10న ప్రారంభమైన అమ్మవారి బ్రహ్మోత్సవాలు నేడు పంచమి తీర్థం, ధ్వజావరోహణంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో, తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పద్మావతి అమ్మవారికి విలువైన సారె పంపారు. సారెలో భాగంగా రూ.2.5 కోట్ల విలువైన బంగారు కాసుల మాల, యజ్ఞోపవీతం సమర్పించారు. కాసుల మాల బరువు 5 కిలోలు. ఈ సారెను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు భక్తులకు ప్రదర్శించారు. కాగా, ఈ సారెను భూమన, ధర్మారెడ్డి స్వయంగా తలపై మోస్తూ అమ్మవారికి ఆలయానికి తీసుకువచ్చారు.

More Telugu News