Salaar: 'సలార్' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

  • ప్రశాంత్ నీల్ నుంచి 'సలార్'
  • యాక్షన్ జోనర్లో నడిచే కథ 
  • ప్రభాస్ జోడీగా అలరించనున్న శ్రుతి హాసన్ 
  • స్పెషల్ సాంగులో మెరవనున్న సిమ్రత్ కౌర్

Salaar Triler Release Date Confirmed

ప్రభాస్ హీరోగా 'సలార్' సినిమా రూపొందుతోంది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్టు పార్టును డిసెంబర్ 22వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. డిసెంబర్ 1వ తేదీన రాత్రి 7:19 నిమిషాలకు ట్రైలర్ ను వదలనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్తగా మరో పోస్టర్ ను వదిలారు. పూర్తిగా యాక్షన్ లోకి దిగిపోయిన ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. 

ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు .. పృథ్వీ రాజ్ సుకుమారన్ .. గరుడ రామచంద్రరాజు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. స్పెషల్ సాంగ్ లో సిమ్రత్ కౌర్ మెరవనుంది. రవి బస్రూస్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంటుందనేది చూడాలి.

More Telugu News