Rahul Gandhi: రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు వేసిన బీజేపీ నేతకు కీలక పదవి

  • మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ పై పూర్ణేశ్ మోదీ కేసు
  • దాద్రా నగర్ హవేలి, డామన్ డయూలకు ఇన్ఛార్జిగా నియామకం
  • జేపీ నడ్డా పేరిట వెలువడిన ఉత్తర్వులు
BJP Leader Who Filed Case Against Rahul Gandhi Gets Key Post

మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత పూర్ణేశ్ మోదీ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే సుప్రీంకోర్టు ఆయనకు ఊరటను ఇచ్చింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. దీంతో, రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని మళ్లీ పునరుద్ధరించారు. మరోవైపు రాహుల్ పై కేసు వేసిన పూర్ణేశ్ మోదీకీ పార్టీ హైకమాండ్ కీలక పదవిని అప్పగించింది. దాద్రా నగర్ హవేలి, డామన్ డయూలకు ఇన్ఛార్జిగా నియమించింది. కో ఇన్ఛార్జిగా దుష్యంత్ పటేల్ ను అపాయింట్ చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

More Telugu News