K Kavitha: ఎన్నికల ప్రచారంలో కళ్లు తిరిగి పడిపోయిన కవిత.. వీడియో ఇదిగో!

Kavitha fell ill in election campaign
  • జగిత్యాల మండలం ఇటిక్యాలలో కవిత ప్రచారం
  • నిలబడటానికి ఇబ్బంది పడ్డ కవిత
  • వాహనంపైనే పడుకోబెట్టి సపర్యలు చేసిన సహచరులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిలబడటానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఛాతీ భాగాన్ని కూడా రెండు, మూడు సార్లు నొక్కుకున్నారు. అనంతరం ఆమె వాహనంపై పడిపోయారు. వాహనంపైనే ఆమెను పడుకోబెట్టి సపర్యలు చేశారు. కవిత పడిపోవడంతో అక్కడున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి ఆమె కోలుకున్నారు. అయితే, ఆమె ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 


  • Loading...

More Telugu News