KTR: ప్రొటోకాల్ లేకుండా సాధారణ పౌరుడిలా హోటల్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసిన కేటీఆర్.. గుర్తుపట్టి షాకైన జనం

Telangana minister KTR sudden entry to Shadab hotel
  • ఈ నెలాఖరులో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు
  • జనంతో మమేకమవుతున్న మంత్రి కేటీఆర్
  • పాతబస్తీలోని షాదాబ్ హోటల్‌లో సందడి చేసిన మంత్రి
  • ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్

మరికొన్ని రోజుల్లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి కేటీఆర్ వీలైనంతగా జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, టీవీ ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇటీవల నిలోఫర్ కేఫ్‌లో సందడి చేసిన కేటీఆర్.. గతరాత్రి షాదాబ్ హోటల్‌కి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాతబస్తీలోని మదీనా చౌరస్తా వద్దకు ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా సాధారణ పౌరుడిలా వచ్చి బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. 

తొలుత ఎవరూ ఆయనను గుర్తుపట్టలేదు. ఆ తర్వాత తమతో ఉన్నది మంత్రి కేటీఆర్ అని గుర్తించి అవాక్కయ్యారు. ఆ వెంటనే హోటల్‌ సందడిగా మారిపోయింది. ఆయనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడున్న వారు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరుపై వారిని అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఇంకా ఏమేమి పనులు చేయాల్సి ఉందన్న దానిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, కేటీఆర్ బిర్యానీతోపాటు విదేశీ వంటకాలను కూడా రుచి చూశారు. అనంతరం అక్కడి నుంచి మొజంజాహి మార్కెట్‌కు వెళ్లి ఐస్‌క్రీం రుచి చూశారు.

  • Loading...

More Telugu News