Raviteja: అమెజాన్ ప్రైమ్ లో హఠాత్తుగా ప్రత్యక్షమైన 'టైగర్ నాగేశ్వరరావు'

  • రవితేజ హీరోగా రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు'
  • అక్టోబర్ 20న థియేటర్లలో విడుదలైన సినిమా
  • ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాని కంటెంట్  
  • ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

Tiger Nageshwara Rao OTT Released

రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' అక్టోబర్ 20వ తేదీన విడుదలైంది. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాలో, నుపుర్ సనన్ .. గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, థియేటర్ల నుంచి ఆశించినస్థాయి రెస్పాన్స్ ను అందుకోలేకపోయింది.

అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా ఎలాంటి పోస్టర్ రిలీజ్ లేకుండానే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అడుగుపెట్టడం ఆశ్చర్యం. 1970ల కాలంలో నడిచే కథ ఇది. అప్పట్లో గజదొంగగా హడలెత్తించిన 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ గా ఈ సినిమా రూపొందింది.

అనుపమ్ ఖేర్ .. మురళీ శర్మ .. జిషు సేన్ గుప్తా .. హరీశ్ పేరడీ .. ఆడుకాలం నరేన్ ..  రేణు దేశాయ్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి కాస్త దూరంగా కనిపించే ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందనేది చూడాలి. 

More Telugu News