TPCC: ఆరు గ్యారెంటీలకు తోడుగా మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్.. అన్ని వర్గాలకు చోటు

  • గాంధీభవన్‌‌లో మేనిఫెస్టో విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే
  • తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులకు రూ. 25 వేల పింఛను 
  • రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ
  • ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం 
  • దివ్యాంగుల పింఛన్ రూ. 5,016కు పెంపు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం 
  • మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ. 2 లక్షలు 
TPCC Release Manifesto For Assembly Election

ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నేడు మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఘర్గే గాంధీభవన్‌‌లో దీనిని విడుదల చేశారు. సమగ్ర, సుస్థిర తెలంగాణను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించినట్టు పేర్కొన్నారు. 

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
*  తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులకు రూ. 25 వేల పింఛను. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
* ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం
* రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల పంట రుణమాఫీ
* రైతులకు రూ. 3 లక్షల వడ్డీలేని రుణాలు
* ‘ధరణి’ స్థానంలో ‘భూమాత’ పోర్టల్
*  వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీ
* ఆడపిల్లల పెళ్లికి రూ. లక్షతోపాటు 10 గ్రాముల బంగారం
* ఎస్సీ వర్గీకరణ అనంతరం కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లు
*  బీసీ కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు
* బీసీ సబ్ ప్లాన్. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు
* సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశాలతోపాటు 5 శాతం రిజర్వేషన్లు
* పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సాయంతో కూడిన ‘బంగారు తల్లి పథకం’
* దివ్యాంగుల పింఛన్ రూ. 5,016కు పెంపు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం
* వ్యవసాయానికి  24 ఉచిత విద్యుత్‌పై మరింత స్పష్టత
* సర్పంచుల ఖాతాల్లో పంచాయతీల అభివృద్ది నిధులు
* గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు
* మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు
* బడ్జెట్‌లో విద్యారంగం వాటా 15 శాతానికి పెంపు
* ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు
* ఆరు నెలల్లోపు మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ
* ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించి మెరుగైన వైద్యం
* ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పింఛన్ విధానం
* జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5 వేల గౌరవ భృతి
* మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ. 5 లక్షలు
* ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం

More Telugu News