Sunny Leone: కాశీలో గంగాహారతికి హాజరైన బాలీవుడ్ నటి సన్నీలియోన్.. సంప్రదాయ దుస్తుల్లో చూసి అభిమానుల ఫిదా!

Bollywood Actor Sunny Leone stuns in ethnic outfit as she attends Ganga aarti in Varanasi
  • సంప్రదాయ దుస్తులు, మెడలో దండతో కార్యక్రమానికి హాజరు
  • సహనటుడు అభిషేక్ సింగ్‌తో కలిసి పాల్గొన్న సన్నీలియోన్
  • మ్యూజిక్ వీడియో ‘థర్డ్ పార్టీ’ని బుధవారం విడుదల చేసిన సన్నీ
సన్నీలియోన్.. ప్రపంచవ్యాప్తంగా చిరపరిచితమైన పేరిది. పోర్న్‌స్టార్‌గా కెరియర్‌ను ప్రారంభించి బాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న ఆమె నిన్న వారణాసిలో గంగాహారతికి హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ఆమె భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సంప్రదాయ పింక్ డ్రెస్‌, మెడలో దండతో కార్యక్రమానికి హాజరైన ఆమె పండితులు పూజలు చేస్తుంటే ముకుళిత హస్తాలతో నిల్చున్నారు. ఆమెతోపాటు నటుడు అభిషేక్ కూడా ఉన్నారు. సన్నీని చూసేందుకు జనం ఎగబడ్డారు. సన్నీలియోన్, అభిషేక్ సింగ్ కలిసి చేసిన ‘థర్డ్ పార్టీ’ మ్యూజిక్ వీడియోను బుధవారం విడుదల చేశారు. ఈ పాటను అభిషేక్ సింగ్ రాసి, పాడడమే కాకుండా కంపోజ్ చేశాడు. 

Sunny Leone
Bollywood
Ganga Aarti
Varanasi
Abhishek Singh

More Telugu News