KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్ బహిరంగ సభలో బుల్లెట్ల కలకలం

Police found bullets in KCR meeting
  • సభకు వచ్చిన అస్లాం నుంచి రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • అస్లాంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
  • సభా ప్రాంగణంలో బుల్లెట్లు దొరకడంతో ఆందోళన
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు కలకలం రేపాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభల పేరుతో కేసీఆర్ వరుసగా నియోజకవర్గాలను చుడుతున్నారు. ఈ క్రమంలో నేడు సాయంత్రం నర్సాపూర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే ఈ సభలో బుల్లెట్లు కలకలం రేపాయి. ఈ సభకు వచ్చిన అస్లాం అనే వ్యక్తి వద్ద నుంచి పోలీసులు రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నర్సాపూర్ సభా ప్రాంగణంలో బుల్లెట్లు దొరకడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
KCR
narsapud
Telangana Assembly Election
BRS

More Telugu News