Australia: 3 కీలక వికెట్లను కోల్పోయిన ఆసీస్... ఆసక్తికరంగా సెమీఫైనల్

  • ఈడెన్ గార్డెన్స్ లో వరల్డ్ కప్ సెమీస్
  • తొలుత 49.4 ఓవర్లలో 212 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్
  • ఛేదనలో 17 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 116 రన్స్ చేసిన ఆసీస్
Australia loses three crucial wickets in chasing

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న సెమీస్ సమరం ఆసక్తికరంగా మారింది. 213 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ 106 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో డేవిడ్ వార్నర్ (29), మిచెల్ మార్ష్ (0), ట్రావిస్ హెడ్ (62) అవుటయ్యారు. 

ప్రస్తుతం కంగారూల స్కోరు 17 ఓవర్లలో 3 వికెట్లకు 116 పరుగులు. స్టీవ్ స్మిత్ 10, మార్నస్ లబుషేన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. సఫారీ బౌలర్లలో రబాడా 1, మార్ క్రమ్ 1, కేశవ్ మహరాజ్ 1 వికెట్ తీశారు. 

ఛేజింగ్ లో ఆసీస్ కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ ఎడాపెడా షాట్లు కొడుతూ స్కోరుబోర్డును ముందుకు ఉరికించారు. అయితే పార్ట్ టైమ్ బౌలర్ గా వచ్చిన మార్ క్రమ్ సూటిగా విసిరిన బంతి వార్నర్ వికెట్లను గిరాటేసింది. దాంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మిచెల్ మార్ష్... రబాడా బౌలింగ్ లో ధాటిగా షాట్ కొట్టినప్పటికీ, వాన్ డర్ డుసెన్ అద్భురీతిలో డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దాంతో మార్ష్ డకౌట్ గా వెనుదిరగకతప్పలేదు. 

ఈ దశలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూకుడును కొనసాగించాడు. 48 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 62 పరుగులు  చేసిన అనంతరం కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దాంతో ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. ఆసీస్ విజయానికి ఇంకా 97 పరుగులు కావాల్సి ఉండగా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి.

More Telugu News