Gudivada Amarnath: చంద్రబాబు పెద్ద కట్టప్ప.. మనోహర్ చిన్న కట్టప్ప: ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్

Chandrababu is Pedda Kattappa and Nadendla Manohar is Chinna Kattappa says Gudivada Amarnath
  • చంద్రబాబు స్క్రిప్ట్ ను మనోహర్ చదువుతున్నారన్న అమర్ నాథ్
  • ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపాటు
  • పవన్ కు మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపణ
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ లపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివేసి... పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టే... పవన్ కల్యాణ్ కు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారని అన్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే... మనోహర్ చిన్న కట్టప్ప అని ఎద్దేవా చేశారు.
Gudivada Amarnath
YSRCP
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Nadendla Manohar
Janasena

More Telugu News