టీచర్ల శిక్షణ కోసం ఏటా బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
- పాఠశాల ఉపాధ్యాయులకు స్టెమ్ రంగాల్లో దేశవిదేశాల్లోని రిటైర్డ్ టీచర్లతో శిక్షణ ఇవ్వాలని సూచన
- ఈ దిశగా దేశవ్యాప్తంగా ట్రెయిన్ ది టీచర్ సెంటర్లు నెలకొల్పాలని సలహా
- జాతీయ విద్యావిధానం లక్ష్యాల కోసం ఈ చర్యలు కీలకమని వ్యాఖ్య
జాతీయ విద్యా విధానం లక్ష్యాలు సాధించేందుకు టీచర్ల శిక్షణ ఎంతో కీలకమని నారాయణమూర్తి అన్నారు. స్టెమ్ రంగాల్లో పాఠశాల ఉపాధ్యాయులకు రిటైర్డ్ టీచర్లతో శిక్షణకు దేశవ్యాప్తంగా ట్రెయిన్ ద టీచర్ సెంటర్లు నెలకొల్పారన్నారు. ఏడాది పాటు ఈ శిక్షణ కార్యక్రమం సాగాలని బుధవారం ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ కార్యక్రమంలో ఆయన సూచించారు. ఇలా సుశిక్షితులైన టీచర్లు మరింత మంది టీచర్లకు మార్గదర్శకంగా మారతారని చెప్పుకొచ్చారు.