Telangana Assembly Election: 30న తెలంగాణలో వేతనంతో కూడిన సెలవు.. తెలంగాణ కార్మిక శాఖ ఉత్తర్వులు

On election days holiday in telangana
  • తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు
  • ఓటింగ్ నేపథ్యంలో సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్న కార్మిక శాఖ
  • అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా నిర్ణయం
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ నిర్ణయించింది. తెలంగాణలో ఈ నెల 30న ఓటింగ్, డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓటింగ్ నేపథ్యంలో 30న కంపెనీలు, దుకాణాలు, పరిశ్రమలు, కర్మాగారాలలో పని చేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవును ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ ఆ ప్రకటనలో వెల్లడించింది.
Telangana Assembly Election
BRS
BJP
Congress

More Telugu News